Breaking News

మోడల్‌ సోలార్‌ సిటీగా అయోధ్య: ప్రధాని మోదీ

Published on Mon, 09/16/2024 - 13:15

గాంధీనగర్‌: ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. అలాగే ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటింగ్ అండ్ ఎగ్జిబిషన్’ (రీ-ఇన్వెస్ట్ 2024) నాలుగో ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ‍ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. ప్రతి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించామన్నారు. యూపీలోని అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.

భారతదేశంలో కనిపించే వైవిధ్యం, సామర్థ్యం, ​​పనితీరు అన్నీ ప్రత్యేకమైనవేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ‘ఇండియన్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ అప్లికేషన్స్’ అని అంటున్నానని, దీనిని ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుందన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ అగ్రగామిగా నిలిచిందని, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన విధానం, గ్రీన్ హైడ్రోజన్ విధానం హరిత భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గుజరాత్‌లో పునరుత్పాదక శక్తి స్థాపిత సామర్థ్యం 50 వేల మెగావాట్లను దాటింది. సోలార్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పటేల్‌ అన్నారు.

ఇది కూడా చదవండి: కౌన్‌ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే!

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)