Breaking News

25న అయోధ్యలో మరో ఉత్సవం.. ‍ప్రధాని మోదీ హాజరు

Published on Mon, 11/24/2025 - 13:22

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం.. నవంబరు 25(మంగళవారం)న మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆరోజున ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ  వేడుక కోసం ఆలయంతో పాటు పట్టణమంతా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా శుభ ముహూర్తంలో పవిత్రమైన ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. మంగళవారం ఉదయం 11.52 నుండి మధ్యాహ్నం 12.35 గంటల మధ్య  శుభ ముహూర్తంలో ఈ వేడుక జరగనుంది. ఇదే సమయంలో హెలికాప్టర్ల నుంచి ఆలయ శిఖరంపై పూలను జల్లేందుకు ఏర్పాట్లు చేశారు. 21 మంది వేద ఆచార్యులు, శంఖం పట్టిన స్వచ్ఛంద సేవకుల నడుమ ప్రధాని మోదీ ఈ పవిత్ర జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

2024 జనవరిలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు దశలవారీగా జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే  ఈ చారిత్రక వేడుకకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి  ఏడువేల మంది అతిథులను ఆహ్వానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బృందాలను ఆహ్వానించింది. అలాగే ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: దడ పుట్టించిన కాబూల్‌ విమానం

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)