Breaking News

ఆగస్టులో సూర్య, చంద్ర గ్రహణాలు.. భారత్‌పై ప్రభావం?

Published on Sat, 07/25/2026 - 09:03

న్యూఢిల్లీ: 2026 ఆగస్టు నెలలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రెండు కూడా సంభవించనున్నాయి. ఆగస్టు 12న అమావాస్య రోజున సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 4:25 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ గ్రహణం యూరప్, స్పెయిన్, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, రష్యా దేశాలలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక రెండోది చంద్ర గ్రహణం.. ఇది ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ రోజున వస్తుంది. ఇది ఉదయం 8:04 గంటలకు ప్రారంభమై ఉదయం 11:22 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్ర గ్రహణం ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియాలలో కనిపించనుంది.

ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించవు. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం, ఏ ప్రాంతంలోనైనా గ్రహణాలు కనిపిస్తేనే వాటికి మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. భారత్‌లో ఈ రెండు గ్రహణాలు కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతక కాలం వర్తించదు. దీనివల్ల పండుగ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికైనా ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆలయాల తలుపులు కూడా యథావిధిగా తెరిచే ఉంటాయి. రక్షాబంధన్ పండుగతో పాటు ఇతర పండుగలపై గ్రహణాల వల్ల ఎలాంటి అశుభ ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. హిందూ నమ్మకాల ప్రకారం గ్రహణానికి ముందు వచ్చే అశుభ కాలాన్ని సూతకకాలం అంటారు. చంద్ర గ్రహణానికి 9 గంటలు, సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అయితే భారత్‌లో ఈ గ్రహణాలు దృశ్యమానం కానందున సూతకకాల నియమాలు ఇక్కడ పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం!

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)