Breaking News

తోడేళ్ల హైజంప్‌ వేట!

Published on Mon, 09/23/2024 - 11:56

బహ్రాయిచ్‌: యూపీలోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలివుందని, దానిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల దృష్టి ఆ ఆరో తోడేలుపైనే నిలిచింది. తాజాగా తోడేళ్ల వేటకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసినవారంతా భయాందోళనకు గురవుతున్నారు.

బహ్రాయిచ్‌ పరిధిలోని నాన్పరా ప్రాంతంలో రెండు తోడేళ్లు ఏడడుగుల గోడను దూకి, అక్కడ కట్టివున్న ఒక మేకను నోట కరుచుకుని తీసుకువెళుతున్న దృశ్యం ఆ సీసీటీవీలో రికార్డయ్యింది. జనసాంద్రత కలిగిన ఆ ప్రాంతంలో ఇలా జరగడంపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. ఒక తోడేలు ఆ మేక మెడను కొరికి పట్టుకోగా, మరొక తోడేలు ఆ మేక వెనుక భాగాన్ని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ మేక కోసం వెదుకగా సమీపంలోని ఒక  మామిడి తోటలో ఆ మేక తల, కాలు కనిపించాయి.

ఈ ఘటన గురించి ఆ మేక యజమాని మున్నా మాట్లాడుతూ తాము రాత్రి భోజనం చేశాక, అంతా పడుకున్నామని, ఇంటి బయట ఉన్న సిమెంటు స్తంభానికి మేకను తాడుతో కట్టివేశామన్నారు.  అయితే రాత్రి 11 గంటల సమయంలో మేక అరుపులు వినిపించి, తామంతా బయటకు వచ్చేసరికి మేకను పట్టుకుని రెండు తోడేళ్లు పరుగులు తీయడం కనిపించిందన్నారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారంతా సంఘటనా స్థలానికి వచ్చారన్నారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. 

ఇది కూడా చదవండి: మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)