Breaking News

ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్షనేతగా అతిషి.. చరిత్రలో తొలిసారిగా..

Published on Sun, 02/23/2025 - 15:45

ఢిల్లీ: ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.

ఆదివారం నిర్వహించిన ఆప్‌ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.

బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్‌ ప్రభుత్వ పనితీరుపై కాగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.

ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్‌ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)