Breaking News

క్షీణించిన మంత్రి అతిశీ ఆరోగ్యం.. నిరసన దీక్ష విరమణ

Published on Tue, 06/25/2024 - 12:40

ఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఆప్‌ జలవనరుల శాఖ మంత్రి అతిశీ విరమించారని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ  ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా  హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోదీకి  లేఖ రాసినట్లు తెలిపారు.

‘‘మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె బీపీ లెవల్స్‌ పడిపోయాయి. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రితలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు.  హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి ఐసీయూలో జాయిన్‌ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు.

తీవ్ర నీటీ సంక్షోభ సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి అతిశీ జూన్‌ 21 నుంచి నిరవధిక నిరాహారాదీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించి హాస్పిటల్‌లో చేరారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)