అతీక్‌కు ఐఎస్‌ఐ, లష్కరేతో లింకులు

Published on Fri, 04/14/2023 - 06:12

ప్రయాగ్‌రాజ్‌: ఉమేశ్‌పాల్‌ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతీక్‌ అహ్మద్‌కు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, ఉగ్రవాద లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం యూపీ పోలీసులు అతీక్‌ అహ్మద్‌ను, అతడి సోదరుడు అష్రాఫ్‌ను భారీ బందోబస్తు నడుమ ప్రయాగ్‌రాజ్‌లోని జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ‘నాకు ఆయుధాలు, డబ్బుకు కొదవలేదు. పాక్‌ నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో పంజాబ్‌కు ఆయుధాలు, డబ్బు చేరుతాయి.

అక్కడ మా వాళ్లు వాటిని అందుకుంటారు. కశ్మీర్‌ ఉగ్రవాదులు కూడా తీసుకెళతారు. కావాలంటే మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తే డబ్బు, ఆయుధాలు అందజేస్తా’అంటూ అతీక్‌ అహ్మద్‌ విచారణలో వెల్లడించిన విషయాలను యూపీ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. రెండు గంటలపాటు సాగిన వాదోపవాదాల అనంతరం అతీక్, అష్రాఫ్‌లిద్దరికీ ఈనెల 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి, ఐదు రోజుల పోలీసు రిమాండ్‌కు అనుమతిస్తూ మేజిస్ట్రేట్‌ దినేశ్‌ గౌతమ్‌ ఆదేశాలిచ్చారని ఉమేశ్‌ పాల్‌ భార్య తరఫు లాయర్‌ చెప్పారు. ఇద్దరినీ రిమాండ్‌ పూర్తయ్యేదాకా ప్రస్తుతమున్న సబర్మతీ, బరేలీ జైళ్లలోనే ఉంచుతారన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)