Breaking News

నిర్మలమ్మ చీర : గ్రహ గతుల విశ్లేషణ ఇదీ!

Published on Sun, 02/01/2026 - 13:03

కేంద్ర బడ్జెట్ రోజున, ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ చీర  ఎపుడూ ప్రత్యేకంగా ఉంటుంది.  మరో విధంగా చెప్పాలంటే బడ్జెట్‌లో లభించే కేటాయింపులు, ఊరటలు, తాయిలాలతో  నిర్మలమ్మ చీరపై కూడా అంతే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ చీరల వెనుక అర్థం పరమార్ధం ఉందంటున్నారు పండితులు.

కేంద్ర బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి ధరించే చీర కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు, అది బడ్జెట్  స్వభావాన్ని సూచించే ఒక దృశ్య సంకేతం. రంగు, ఆకృతి, ఆ డిజైన్‌లోని సంయమనం  దేశప్రజలకు రాబోయే ఆర్థిక నిర్ణయాలకు మానసికంగా సిద్ధం చేస్తాయట.  

బడ్జెట్‌ ప్రసంగంలో ఎపుడూ  చేనేత చీరలకే ప్రాధానమిచ్చే నిర్మలా ఈ సారి అదే సంప్రదాయాన్ని పాటించారు. తమిళనాడు పురాతన నేత వారసత్వాన్ని గౌరవిస్తూ, చేనేత కాంచీవరం పట్టు చీరలోకనిపించారు. 2026 బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాఘ పూర్ణిమ రవి పుష్య యోగంలో తన తొమ్మిదవ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా విత్తమంత్రి చీరఎంపిక క్రమశిక్షణ, నియంత్రిత అధికారం, గంభీరతను ప్రతిబింబిస్తుంది. ఈ చీరను అర్థం చేసుకోవడానికి ఈ నేపథ్యం చాలా అవసరమని అంటున్నారు.

 ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్‌ పెట్టుబడులు


నిర్మలమ్మచీర,   గ్రహ గతుల విశ్లేషణ
2026, ఫిబ్రవరి 1,ఆదివారం
ఆదివారం: సౌర అధికారాన్ని, ఆజ్ఞను సూచిస్తుంది.
మాఘ నక్షత్రం: చట్టబద్ధత , శక్తికి ప్రతీక.

గ్రహాల స్థితి: మకర రాశిలో గ్రహాల కూటమి, ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు, కుంభంలో రాహువు , మీనంలో శని ఉండటం వల్ల... ఈ రోజు భావోద్వేగాల కంటే వ్యవస్థాత్మక నిర్మాణం , నియంత్రణకు ప్రాధాన్యతనిస్తుంది.

చీర రంగు పర్పుల్-మెజెంటా, నియంత్రిత శక్తికి నిదర్శనం. పర్పుల్ , మెజెంటా మిశ్రమ రంగు ధైర్యానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇది కుజ శక్తిని సూచిస్తుంది. ఇది భావోద్వేగాలకు లొంగకుండా, దృఢమైన నిర్ణయాలు తీసుకునే ధోరణిని తెలుపుతుంది. ప్రజాకర్షక (Populist) పథకాల కంటే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణకే మొగ్గు చూపుతారని ఇది సూచిస్తోంది.

పసుపు-బంగారు అంచు (Border): పరిమిత వృద్ధి ఇది  గురు గ్రహానికి (అభివృద్ధి, సంక్షేమం) సంబంధించినవిగా భావిస్తారు. అయితే, ఈ రంగు చీర మొత్తం కాకుండా కేవలం అంచుకే పరిమితం కావడం గమనార్హం. అంటే, వృద్ధి ,సంక్షేమం గురించి చర్చ ఉంటుంది, కానీ అవి ఆర్థిక పరిమితులకు లోబడే ఉంటాయి.

ప్యాటర్న్ అడ్డ , నిలువు గీతలు : శని , క్రమశిక్షణకు సంకేతం.
చీరపై ఉన్న సమాంతర , నిలువు గీతలు అనేవి క్లాసిక్ శనిగ్రహ చిహ్నాలు. శని ప్రభావానికి , మకర రాశి తత్వానికి నిదర్శనం. ఎలాంటి  పూల డిజైన్లు (Motifs) లేకపోవడం వల్ల, ఈ బడ్జెట్ సెంటిమెంట్‌పై కాకుండా పాలసీ స్ట్రక్చర్  పైనే ఆధారపడి ఉంటుందని పండితుల అంచనా. నిర్మల ఈ చీరను ఎంచుకోవడం అంటు తన వస్త్రధారణ ద్వారా దేశానికి 'క్రమశిక్షణ' అనే సందేశాన్ని పంపినట్టు భావిస్తున్నారు.  సంక్షేమ పథకాలు భావోద్వేగ ప్రాతిపదికన కాకుండా, వ్యవస్థాత్మక పద్ధతిలో, దీర్ఘ కాలిక ప్రయోజాలను ఆశించేలా,  నియమపాలన, సంస్థాగత బలంపై దృష్టిపెట్టేలా తమ బడ్జెట్‌ ఉండబోతోందని అంచనాలను దేశప్రజలకు అందించినట్టన్నమాట.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)