Breaking News

అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!

Published on Tue, 02/06/2024 - 12:00

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు.

యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు.  అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్‌పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్‌పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)