Breaking News

బంగ్లాకు రెండు ‘చికెన్‌ నెక్‌లు’: మ్యాప్‌ షేర్‌ చేసిన అస్సాం సీఎం శర్మ

Published on Mon, 05/26/2025 - 09:43

గౌహతి: బంగ్లాదేశ్‌ను ఈశాన్య  రాష్ట్రాలలో కలిపే భారతదేశ చికెన్ నెక్‌ కారిడార్‌(Chicken Neck Corridor)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో రెండు ఇరుకైన ‘చికెన్‌ నెక్‌’లు ఉన్నాయని, అవి మరింత దుర్భలమైనవని శర్మ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో గల ‘చికెన్స్ నెక్’ గురించి ముహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యల దరిమిలా సీఎం శర్మ ఈ విధంగా స్పందించారు.

బంగ్లాదేశ్‌(Bangladesh)లోని మొదటి ‘చికెన్ నెక్’ దఖిన్ దినాజ్‌పూర్  అని, ఇది నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ అని పేర్కొన్నారు. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే రంగ్‌పూర్ డివిజన్‌ను బంగ్లాదేశ్ నుండి పూర్తిగా వేరు చేయవచ్చని ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో తెలిపారు. అలాగే ఈ రహదారిని చూపించే మ్యాప్‌ను ఆయన పంచుకున్నారు. రెండవది దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్ అని  శర్మ తెలిపారు. భారతదేశానికున్న చికెన్ నెక్ కంటే చిన్నగా ఉన్న ఈ కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానికి మధ్య ఉన్న ఏకైక లింక్ అని ఆయన చిట్టగాంగ్ -ఢాకాలను ప్రస్తావిస్తూ  పేర్కొన్నారు.

భారతదేశంలోని సిలిగురి కారిడార్  మాదిరిగానే బంగ్లాదేశ్‌లోనూ రెండు ఇరుకైన కారిడార్లు ఉన్నాయని సీఎం అన్నారు. కొంతమంది మరచిపోయిన భౌగోళిక వాస్తవాలను తాను గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. గత మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌ బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు విస్తరించడాన్ని ఆహ్వానిస్తూ, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’(Seven Sisters’) అని అంటారని, ఇవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితంగా ఉన్నాయని, అక్కడి వారికి సముద్ర తీరాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలు లేవని యూనస్‌ వ్యాఖ్యానించారు. అందుకే మేమే వారికి రక్షకులం అని వ్యాఖ్యానించారు. ఇది బంగ్లాదేశ్‌కు పలు అవకాశాలను అందిస్తుందని, చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించడంలో ఇది అనుకూలంగా ఉంటుందని  యూనస్‌ పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సీఎం శర్మ ఈ ప్రకటనను అభ్యంతరకరమైనదిగా, తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. యూనస్‌ ‍ప్రకటన దరిమిలా చికెన్స్ నెక్ కారిడార్ కింద, చుట్టూ మరింత బలమైన రైల్వే , రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసమని పేర్కొన్నారు. అలాగే చికెన్స్ నెక్‌ను దాటేందుకు, ఈశాన్యాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించేందుకు ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని సీఎం అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌ యూనిస్ చేసిన ప్రకటనలను తేలికగా తీసుకోకూడదని, వారి వ్యూహాత్మక, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయని సీఎం శర్మ పేర్కొన్నారు. కాగా బారతదేశంలోని ఈ‘చికెన్‌ నెక్’ను సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. ఇరుకుగా ఉన్న కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని భౌగోళిక ఆకారం కారణంగా దీనిని ‘చికెన్ నెక్’ అని పిలుస్తారు. ఈ మార్గానికి ఉత్తరాన నేపాల్, భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)