Breaking News

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

Published on Sat, 03/22/2025 - 09:45

గౌహతి: విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఒక ప్రొఫెసర్‌ బాగోతం మరువకముందే, అస్సాంలోని సిల్చార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపుల వార్తల్లో నిలిచారు. సిల్చార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్‌)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర్ రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు డాక్టర్ కోటేశ్వర్ రాజును అరెస్ట్‌ చేశారు. అతనిని నిట్‌ నుంచి కూడా సస్పెండ్‌ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  నుమల్ మహత్తా తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా అతనిని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(Bachelor of Technology) విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని  విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు.  బాధితురాలి ఫిర్యాదులోని వివరాల ప్రకారం ప్రొఫెసర్ ఆమెను తన చాంబర్‌కు పిలిచి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

ఈ నేపధ్యంలో బాధితురాలు ఇన్‌స్టిట్యూట్ అధికారులకు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులో.. ప్రొఫెసర్ తనకు వచ్చిన తక్కువ గ్రేడ్‌ల గురించి చర్చించేందుకు, చాంబర్‌కు పిలిచారని, ఆ తరువాత తనను అనుచితంగా తాకాడని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు గురించి తెలియగానే నిందితుడు దాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి తెలిపారు. అతని మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి, అతనిని, అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ తర్వాత అతనిని భారత శిక్షాస్మృతి (బీఎస్‌ఎన్‌) లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణను భారత్‌ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం
 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)