Breaking News

అసోంలో ఇక శాంతి పవనాలు

Published on Sat, 12/30/2023 - 05:52

న్యూఢిల్లీ:  దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది.

శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్‌ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. 

ఏమిటీ ఉల్ఫా?  
‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్‌తో 1979 ఏప్రిల్‌ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్‌ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్‌ఖోవా వర్గం 2011 సెపె్టంబర్‌ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్‌ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్‌ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్‌ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)