Breaking News

రెండో మాజీ భర్త గుట్టు విప్పితే.. ప్రియుడేమో!

Published on Wed, 09/17/2025 - 16:26

ప్రపంచం మొత్తమ్మీద ఏ గొడవకైనా రెండే రెండు కారణాలు ఉంటాయిట. మొదటిది నగదు. రెండోది మగువ అంటారు. కించపరచడం ఉద్దేశం కానే కాదు కానీ..మహిళలపై పురుషులకున్న వ్యామోహమనండి, వాంఛ అనండి.. ఇంకోటి అనండి అనేకానేక గొడవలకు కారణమవుతుందన్నది సత్యం. 

అసోమ్‌(అస్సాం) సివిల్‌ సర్వీసెస్‌ అధికారి నూపుర్‌ బోరా విషయమే తీసుకుందాం. అవినీతి ఆరోపణలతో ఆమెపై ఇటీవలే విజిలెన్స్‌ దాడులు జరిగాయి. సుమారు 92 లక్షల రూపాయల నగదు, రెండు కోట్ల రూపాయల విలువైన నగలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది. కేసుకు సంబంధించి నూపుర్‌ బోరా బాయ్‌ఫ్రెండ్‌, రెవెన్యూ ఆఫీసర్‌ సుర్జీత్‌ డేకాను కూడా విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మూడు రోజుల పోలీస్‌ రిమాండ్‌కు పంపారు. ఇక్కడితో స్టోరీ ఖతమైపోలేదు. షురూ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే..

నూపుర్‌పై విజిలెన్స్‌ దాడులు జరగడంలో ముఖ్య పాత్ర ఆమె రెండో మాజీ భర్త.  ఆయనిచ్చిన టిప్‌తోనే విజిలెన్స్‌ వాళ్లు ఆమెపై రెయిడ్‌ చేశారని తెలుస్తోంది. ఈయనతోపాటు అంతకుముందు ఇంకొకరితో నూపుర్‌కు వివాహం, విడాకులు రెండూ అయ్యాయి. ఆ తరువాత బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది. బోరా పాపంలో ఇప్పుడు అతగాడి వాటాను తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. 

2019లో అసోమ్‌ సివిల్‌ సర్వీసెస్‌లో చేరిన నూపుర్‌ కార్బీ అంగ్‌లాంగ్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత బార్పేట, కామ్‌రూప్‌ జిల్లాల్లో సర్కిల్‌ ఆఫీసర్‌గానూ సేవలందించారు. సివిల్‌ సర్వీసెస్‌లోకి చేరే ముందు ఇంగ్లీషు టీచర్‌గా పని చేసిన అనుభవమూ ఉంది.

అవినీతి ఆరోపణలేమిటి?
ప్రభుత్వ భూములను బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వలసదారులకు అక్రమంగా బదిలీ చేసిందన్నది నూపుర్‌పై ఉన్న అనేకానేక ఆరోపణల్లో ఒకటి. భూమికి సంబంధించిన విషయాలను సెటిల్‌ చేసేందుకు రూ.1500 నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేసేదని చెబుతున్నారు. క్రిషిక్‌ ముక్తి సమితి అనే స్వచ్ఛంద సంస్థ, ఎమ్మెల్యేల అఖిల్‌ గొగోయ్‌ వంటివారు నూపుర్‌ అవినీతి కార్యకలాపాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు కూడా. దీంతో సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యవేక్షణలో ఉండే.. సీఎం స్పెషల్‌ విజిలెన్స్‌ సెల్‌ ఆర్నెలుగా నిఘా ఉంచింది.  ఆఖరికు ఆకస్మిక తనిఖీలతో అరెస్ట్‌ చేసింది. నగదు, నగలతోపాటు నూపుర్‌ అవినీతికి ఆనవాళ్లుగా గౌహతిలో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు కోట్ల రూపాయల విలువైన నగల్లో పద్నాలుగు బంగారు గొలుసులు, 15 వజ్రపుటుంగరాలు, మూడు వజ్రాల గాజులు ఉన్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే.. నూపుర్‌ ఇరువురు మాజీ భర్తలు కూడా రెవెన్యూ ఆఫీసర్లే కావడం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)