Breaking News

అస్సాం సివిల్‌ సర్వీసు అధికారిణి నూపుర్‌ బోరా అరెస్టు

Published on Wed, 09/17/2025 - 05:09

గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్‌ సర్వీసు(ఏసీఎస్‌) అధికారిణి నూపుర్‌ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్‌కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్‌ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.

ఎవరీ అధికారిణి?: నూపుర్‌ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్‌ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 2019లో ఏసీఎస్‌ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్‌ కమిషనర్‌గా, తర్వాత సర్కిల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్‌‌ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్‌పేట జిల్లాలో సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.

ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్‌ గొగోయ్‌ నేతృత్వంలోని కృషాక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి(కేఎంఎస్‌ఎస్‌) అనే సంస్థ నూపుర్‌ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్‌నకు రూ.1,500, ల్యాండ్‌ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్‌ బోరా సహాయకుడు, బార్‌పేట రెవెన్యూ సర్కిల్‌ ఆఫీసర్‌ సురాజిత్‌ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్‌ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)