Breaking News

చిన్నారులతో కలిసి హుషారుగా గంతులేసిన సీఎం

Published on Mon, 01/09/2023 - 13:52

దిస్‌పూర్‌: నిత్యం తన స్టేట్‌మెంట్లతో, దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. హుషారుగా జానపద నృత్యంతో ఆకట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన సందడి చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఝుమూర్‌ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పారాయన. హతింగా టీఈ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్‌’ ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆయన సైతం వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా.. 

వాళ్లను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్‌ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. స్టెప్పులేశారు. ఆయన్ని చూసి మరికొందరు విద్యార్థినిలు స్టేజ్‌ ఎక్కారు. ఇక శర్మ భార్య రింకీ భూయాన్‌ శర్మ కూడా వాళ్లతో కలిశారు. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్‌ మాన్‌కీ, ప్రముఖ సింగర్‌ గీతాంజలి దాస్‌ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం తర్వాత సీఎం హిమంత శర్మ.. విద్యార్థులతో కలిసి డిన్నర్‌ చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)