Breaking News

Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య

Published on Sat, 03/15/2025 - 10:09

ముంగేర్‌: బీహార్‌(Bihar)లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో మద్యం మత్తులో మునిగిన కొందరు యువకులు ఒక పోలీసు అధికారి తల పగులగొట్టారు. వెంటనే స్థానికులు ఆ పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌  చేశారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.

ఈ ఘటనలో రోహ్‌తక్‌(Rohtak)కు చెందిన ఏఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ మృతిచెందారు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ముఫస్సిల్‌ పోలీస్‌ స్టేషన్‌కు డయల్‌ 112కు ఫోను వచ్చింది. నందలాల్‌పూర్‌లో మద్యం మత్తులో ఇరు వర్గాలు ఘర్ణణ పడుతున్నాయని ఆ ఫోను ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఏఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తన బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు గ్రూపులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయితే పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో వారిలో ఒకరు మారణాయుధంతో ఏఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ తల పగులగొట్టారు. వెంటనే అతను స్పృహ తప్పి కింద పడిపోయారు. అతని తల నుంచి విపరీతంగా రక్తం కారసాగింది. దీంతో స్థానికులు, పోలీసులు అతనిని వెంటనే ముంగేర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్‌ కుమార్‌ను ముంగేర్‌ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పట్నా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సంతోష్‌ కుమార్‌ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు