Breaking News

ఈడీ ముందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ కుమారుడు

Published on Mon, 10/30/2023 - 16:41

ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ నేడు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది.

ఆగస్టులో జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని పలు ప్రదేశాలలో మూడు రోజుల పాటు ఈడీ దాడులు చేసింది. రాజస్థాన్ ఆధారిత హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటన్ హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా వర్ధ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మ తదితరులపై ఈడీ ఇటీవల దాడులు జరిపింది. వైభవ్ గెహ్లాట్‌తో వ్యాపారవేత్త రతన్‌ కాంత్ శర్మకు సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ పరిణామాల అనంతరం వైభవ్ గహ్లోత్‌కు కూడా సమన్లు జారీ చేసింది. కాగా.. గతంలో రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ కంపెనీలో వైభవ్ గెహ్లోత్‌ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు.

రాజస్థాన్‌లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైభవ్ గహ్లోత్‌పై ఈడీ దాడులు చేయడంతో కాంగ్రెస్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈడీ దాడులు అని ఆరోపిస్తోంది.

ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్‌లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)