Breaking News

ఆర్జేడీ కాంగ్రెస్‌ మధ్య గహ్లోత్‌ రాయబారం 

Published on Thu, 10/23/2025 - 06:08

పట్నా: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్తాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

లాలూతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటే ఇండియా కూటమి పార్టీల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి సీఎం అభ్యరి్థగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ‘నా నుంచి అలాంటి ప్రకటనను మీరు ఎందుకు ఆశిస్తున్నారు?’అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.

 ‘రెండు నెలల క్రితం ఓటర్‌ అధికార్‌ యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాం«దీ, తేజస్వీ కలిసి రాష్ట్రమంతా పర్యటించడాన్ని మీరంతా చూశారు. అన్ని విషయాలపై తగిన సమయంలో వారే తగిన నిర్ణయం తీసుకుంటారు’అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 61 చోట్ల పోటీ పడుతోంది. అయితే, కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీలోనూ ఉన్నాయి. ఆర్జేడీ నేతలు ఇటీవల ‘తేజస్వీ సర్కార్‌’నినాదం అందుకోవటంతో కాంగ్రెస్‌ కినుకు వహించినట్లు చెబుతున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)