Breaking News

Arvind Kejriwal: ఉచిత విద్యుతిస్తే బీజేపీకి ప్రచారం చేస్తా

Published on Mon, 10/07/2024 - 05:39

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్‌ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానన్నారు. పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్‌కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో జరిగిన ఆప్‌ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు.

 ‘‘వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17కు మోదీకి 75ఏళ్లు వస్తాయి. రిటైరవుతారు. ప్రధానిగా ఆయనకు మరో ఏడాది సమయమే ఉంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింట్లోనూవిద్యుత్తు ఉచితంగా ఇవ్వండి. బడులు, ఆసుపత్రులు బాగు చేయండి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తా’’ అన్నారు. 

‘‘డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమటే ‘డబుల్‌ దోపిడీ, నిరుద్యోగం, అధిక ధరలు’. హరియాణాలో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ దిగిపోనుంది. జార్ఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పోతాయి’’ అన్నారు. తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్‌ ఉందని కేజ్రీవాల్‌ అన్నారు. ‘‘ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్ర, ఆరోగ్య వసతులు, విద్య... ఇవే ఆ ఆరు స్వీట్లు’’ అని చెప్పారు. ఢిల్లీలో పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)