Breaking News

సీఎం కేజ్రీవాల్‌కు క్యాన్సర్‌? అవే లక్షణాలు?

Published on Mon, 05/27/2024 - 12:00

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున  తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. పీఈటీ, సిటీ  స్కాన్ తదితర వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తన మధ్యంతర బెయిల్‌ను ఒక వారం పాటు పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో వివరించారు.

అరవింద్ కేజ్రీవాల్‌లో కనిపిస్తున్న లక్షణాలు తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్‌ని కూడా సూచిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. దీని తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి జూన్ ఒకటి వరకు ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మే 10న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే జూన్ 2న కోర్టుకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది.

బిజినెస్ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఆప్‌ నేత అతిషి  మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కేజ్రీవాల్‌ ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నసమయంలో అతని బరువు ఏడు కిలోలు మేరకు తగ్గింది. అకస్మాత్తుగా బరువు తగ్గడం  అనేది ఆందోళన కలిగించే అంశమని, కస్టడీ నుంచి బయటకు వచ్చాక, వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజీవాల్‌ తిరిగి బరువు పెరగడం లేదని అతిషి తెలిపారు.

ఢిల్లీ సీఎంకు జరిపిన వైద్య పరీక్షల్లో అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందని అతిషి చెప్పారు. అధిక కీటోన్ స్థాయిలతో పాటు ఆకస్మికంగా బరువు తగ్గడం అనేది క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధులకు సంకేతమని ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్‌  పీఈటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారని అతిషి వివరించారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)