Breaking News

ఢిల్లీ లిక్కర్‌ కేసు: రౌస్‌ అవెన్యూ కోర్టుకు సీఎం కేజ్రీవాల్‌

Published on Thu, 05/30/2024 - 13:04

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్‌ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.

మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.

ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్‌ 2న మళ్లీ తిరిగి తిహార్‌ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో  ఏడు రోజులు బెయిల్‌ పొడిగించాలని కేజ్రీవాల్‌ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)