Breaking News

కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో 3 అపార్ట్‌మెంట్లు

Published on Mon, 07/03/2023 - 06:21

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మండావలి జైలులో గడుపుతున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కాంట్రాక్టర్‌ నుంచి 2020లో అందిన ముడుపులతో వీటిని కొనుగోలు చేశారని ఆరోపించాడు. ఈ మేరకు మండావలి జైలు నుంచి మీడియాకు సుఖేష్‌ తన న్యాయవాది అనంత మాలిక్‌ ద్వారా తాజాగా మరో లేఖను విడుదల చేశారు.

దుబాయ్‌లోని జుమైరా పామ్స్‌లోని మూడు అపార్ట్‌మెంట్లను అత్యవసరంగా 65 మిలియన్‌ దిర్హామ్స్‌ (ఏఈడీ)కు అమ్మాలని వారం క్రితం దుబాయ్‌లోని తన సహచరుడు మనోజ్‌ జైన్‌ను కేజ్రీవాల్‌ కోరారని సుఖేశ్‌ ఆ లేఖలో ఆరోపించాడు. తనకు, సత్యేందర్‌ జైన్‌కు మధ్య జరిగిన  వాట్సాప్‌ చాట్‌లో దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్ల కొనుగోలు లావాదేవీల వివరాలున్నాయని, ఆ చాట్‌ను విడుదల చేస్తానని సుఖేశ్‌ పేర్కొన్నాడు. వారం రోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తానని కూడా వెల్లడించాడు. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే హతమారుస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. త్వరలో కేజ్రీవాల్‌ తిహార్‌ జైలుకు చేరుతారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)