Breaking News

వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు: కేజ్రీవాల్

Published on Wed, 10/04/2023 - 13:23

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక  ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 

'ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోనూ ఏమీ లభించలేదు. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. అయినా.. లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం' అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆప్‌ ఎంపీ(రాజ్యసభ) సంజయ్‌ సింగ్‌కు చెందిన నార్త్‌ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్‌లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్‌ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్‌ను సంజయ్‌ సింగ్‌ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్‌సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది.

బీజేపీ ఫైర్‌
సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా మండిపడింది. దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. 

ఇదీ చదవండి: Delhi Liquor Policy Case: ఆప్‌ కోసం లిక్కర్‌ స్కామ్‌ డబ్బులు.. అందుకే సంజయ్‌ సింగ్‌ ఇంట సోదాలు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)