Breaking News

ఉన్నత విద్యలోనూ ఏఐ

Published on Fri, 10/10/2025 - 04:44

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ∙(ఏఐ) తాజాగా విద్యార్థుల చదువుల్లోనూ భాగమైంది. దేశంలోని 60 శాతంపైగా ఉన్నత విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ఉపయోగించడానికి విద్యా ర్థులకు అనుమతిస్తున్నట్లు ఈవై–పార్థనాన్‌–ఫిక్కీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం లెర్నింగ్‌ మెటీరి యల్స్‌ను (బోధనాంశాలు) అభివృద్ధి చేయడానికి జనరేటివ్‌ ఏఐని ఇప్పటికే 53 శాతం విద్యాసంస్థలు ఉపయోగించడం ప్రారంభించాయి.

దేశవ్యాప్తంగా 30 ఉన్నత విద్యాసంస్థలపై చేపట్టిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇందులో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బోధన, పరిపా లనలో ఏఐను ఎలా స్వీకరిస్తున్నాయో వివరించింది. 40 శాతం ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత ట్యూటరింగ్‌ సిస్టమ్స్, చాట్‌బాట్స్‌ను ఉపయోగిస్తుండగా 39 శాతం సంస్థలు అడాప్టివ్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తున్నాయి. అలాగే 38 శాతం కాలేజీలు ఆటోమేటెడ్‌ గ్రేడింగ్‌ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వాల విధివిధానాల మార్గనిర్దేశంలో ఏఐ వినియోగం జరగాలని నివేదిక సూచించింది.

అన్ని విభాగాలలో ఏఐ..
ఉన్నత విద్యారంగంలోని అన్ని రకాల కోర్సుల్లో ఏఐ అక్షరాస్యతను పెంపొందించాలని నివేదిక ప్రతిపాదించింది. విద్యార్థులంతా ఏఐ భావనలు, నీతి, అప్లికేషన్స్‌పై ప్రాథ మిక అవగాహనను అలవర్చు కోవాలని సూచించింది. ఇందులో డిజిటల్‌ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, డేటా వినియోగం తదితర అంశాలపై నైతిక అవగాహన కల్పించాలని నివేదిక వివరించింది.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) ప్రోగ్రామ్స్‌లో మెషీన్‌ లెర్నింగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, రోబోటిక్స్‌ వంటి అధునా తన కంటెంట్‌ను ప్రధాన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం ముఖ్యమని నివేదిక అభిప్రాయపడింది. భారతీయ గ్రాడ్యుయేట్లను కేవలం ఏఐ వినియోగదారులుగానే కాకుండా ఏఐ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. 

శిక్షణ, మౌలిక వసతులకు..
విద్యార్థుల్లో ఏఐపట్ల ఉత్సాహం అధికంగా ఉన్న ప్పటికీ ఏఐ బోధకులు ఆ స్థాయిలో లేకపోవడం సవా ల్‌గా మారిందని నివేదిక పేర్కొంది. అధ్యాపకులను సన్నద్ధం చేయడం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తక్షణ అవసరాలని పేర్కొంది. ఏఐ స్వీకరణను సమర్థంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి విద్యాసంస్థలు అధ్యాపకులకు శిక్షణ, మౌలికవసతుల మెరుగుదల కోసం పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేసింది. 

ఈ అంశాలు కార్యరూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్‌ ముందంజలో ఉంటుందని నివేదిక వివరించింది. ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత కార్యకలాపాల వైపు ముందుకు సాగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, సమగ్రత మధ్య సమతూకం పాటించడం సవాలేనని అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)