Breaking News

Article 370 Removal: అది మా అజెండాలో ఉంది: బీజేపీ నేతలు

Published on Mon, 08/05/2024 - 10:15

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రక ఘట్టానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు బీజేపీ నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ‘ఇది మా(బీజేపీ) ఎజెండాలో ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీని కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు. నరేంద్ర మోదీ  జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి స్థానికులకు స్వేచ్ఛ కల్పించారు’ అని అన్నారు.
 

 

 జమ్ముకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ‘2019, ఆగస్టు 5 న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రతి వ్యక్తికి హక్కులు లభించాయి. ఆర్టికల్ 370 తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు జమ్ముకశ్మీర్ ప్రజలకు ద్రోహం చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా  ప్రధాని మోదీ ‘వన్ ఇండియా-బెస్ట్ ఇండియా’ సంకల్పాన్ని నెరవేర్చారు’ అని అన్నారు.

 

జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఆర్టికల్ 370, 35ఏలను తొలగించడం ద్వారా జమ్ము, కశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రవాదం అదుపులోకి వచ్చింది. వేర్పాటువాదులు జైలులో ఉన్నారు. స్థానికులు ఉపాధి పొందుతున్నారు. లోయలో శాంతి నెలకొంది’ అని అన్నారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి