Breaking News

హైదరాబాద్‌ నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయండి 

Published on Mon, 07/17/2023 - 01:20

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ నుంచి నేరుగా అమెరికాకు విమానసర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి యూఎస్‌ఏ ఎన్నారైలు వినతిపత్రం సమరి్పంచారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలుగు ఎన్నారైలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్‌ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా ఎయిర్‌ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్‌ చేయటంతోపాటు, కొత్త రూట్లలో విమాన సర్వి సులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విలాస్‌ జంబుల, లక్ష్మణ్‌ అనుగు, సంతోష్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తుమ్మల, ప్రదీప్‌ కట్టా, వంశీ యమజాల, మధుకర్‌ రెడ్డి, రామ్‌ వేముల, రఘువీర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. 

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ నేతలు భేటీ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌ రెడ్డితో అమెరికాలోని ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాని, లక్ష్మణ్‌ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణవాసులు, టీడీఎఫ్‌ పోషించిన పాత్రను కిషన్‌రెడ్డి అభినందించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)