Breaking News

కేరళ అనంతపద్మనాభ ఆలయంలో బంగారం చోరీ!

Published on Sun, 05/11/2025 - 11:35

కేరళలోని ‍ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో తక్కువ మొత్తంలో సుమారు 100 గ్రాముల మేర బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వచ్చాయి. బంగారం పూత నిమిత్తం ఆలయంలో ఉంచిన సుమారు 12 పవనాల (కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో బంగారాన్ని పవనాల్లో కొలుస్తారు. ఒక్కో పవనం 8 గ్రాములకు సమానం) బంగారం కనిపించకుండా పోయిందని ఆయా వార్తా నివేదికల్లో పేర్కొన్నారు.

ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పినట్లుగా ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. చివరిసారిగా రెండు రోజుల క్రితం గోల్డ్ ప్లేటింగ్ పనులు జరిగాయి. ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచి మళ్లీ పని నిమిత్తం బంగారాన్ని బయటకు తీసుకెళ్లగా సుమారు 12 పవనాల పసిడి మాయమైంది. ఈ మేరకు ఫిర్యాదు నమోదైనట్లు ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల భద్రతా లోపం ఉందని, ఈ చోరీ వెనుక ఆలయంలోని వ్య​‍క్తుల హస్తం ఉండొచ్చని మరికొన్ని వార్తా సంస్థలు నివేదించాయి.

గతంలో కూడా ఈ ఆలయంలో బంగారం చోరీకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. 2015లో సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక ఆడిట్ రిపోర్టులో, ఆలయంలోని నిధుల నుండి 266 కిలోల బంగారం కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ బంగారం ఆలయ అలంకరణ కోసం బయటకు తీసినప్పుడు మాయమైనట్లు రిపోర్టు పేర్కొంది. అయితే ఎవరినీ నేరంగా బాధ్యులుగా నిర్ధారించలేదు.

2017లో ఆలయంలో రూ. 189 కోట్ల విలువైన బంగారం, ఎనిమిది పురాతన వజ్రాలు కనిపించకుండా పోయినట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనలపై కేరళ  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇక 2024 అక్టోబరులో ఆలయంలో ప్రసాదం కోసం ఉపయోగించే ఒక ఇత్తడి పాత్ర మాయమైనట్లు వార్తలు వచ్చాయి.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయ సంపద రూ. 1.5 లక్షల కోట్ల విలువైనదిగా అంచనా. 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదులలో ఐదింటిని తెరిచారు. వీటిలో అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి. అయితే, ఒక గదిని మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. దీని వెనుక సాంకేతిక, మతపరమైన కారణాలు ఉన్నాయని చెబుతారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)