రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదం..  ఏపీకి చెందిన ఆర్మీ మేజర్‌ కన్నుమూత

Published on Tue, 10/14/2025 - 05:51

జైసల్మీర్‌: రాజస్తాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఒక అధికారి చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన మేజర్‌ టీసీ భరద్వాజ్‌(33) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు అని అధికారులు తెలిపారు. ఈ ఘటన జైసల్మీర్‌ జిల్లాలోని గమ్నే వాలా గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్‌ వైపు నుంచి లొంగెవాలా వైపు వెళ్తున్న ఆర్మీ జిప్సీ వాహనం మూలమలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో లెఫ్టినెంట్‌ కల్నల్, ముగ్గురు మేజర్‌ స్థాయి అధికారులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

 వెంటనే వీరిని రామ్‌గఢ్‌ ఆస్పత్రికి తరలించారు. భరద్వాజ్‌ అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షతగాత్రులైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రశాంత్‌ రాయ్‌(33), మేజర్‌ అమిత్, మేజర్‌ ప్రాచీ శుక్లా, డ్రైవర్‌ జవాన్‌ నసీరుద్దీన్‌లను ప్రాథమిక చికిత్స అనంతరం జైసల్మీర్, జోధ్‌పూర్‌లలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మేజర్‌ ప్రాచీ శుక్లా తలకు, మేజర్‌ అమిత్‌ కుడి కన్ను వద్ద తీవ్ర గాయాలైనట్లు తనొత్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు. మేజర్‌ భరద్వాజ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆర్మీకి అప్పగించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)