Breaking News

మరోసారి రెచ్చగొడితే  ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 

Published on Fri, 10/03/2025 - 16:30

జైపూర్‌: భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఇప్పటిదాకా సాగించిన ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపాలని, లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ ఉండదని తేల్చిచెప్పారు. భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తే పాకిస్తాన్‌ అనే దేశం ఇకపై చరిత్రలో మాత్రమే మిగిలిపోతుందని స్పష్టంచేశారు. తమను మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 ప్రారంభిస్తామని ఉద్ఘాటించారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ 1.0లో చూపించిన సహనం, సంయమనాన్ని ఈసారి చూపించబోమని పేర్కొన్నారు. జనరల్‌ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం రాజస్తాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఆర్మీ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో స్థానాన్ని, భౌగోళిక ఉనికిని కాపాడుకోవాలా? వద్దా? అనేది పాకిస్తాన్‌ చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే ప్రమాదంలో పడుతుందన్నారు. ఈసారి బలంగా దెబ్బకొడతామని అన్నారు.    

త్వరలో మరో అవకాశం రావొచ్చు 
ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే దీటుగా తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని భారత సైనిక దళాలకు జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సూచించారు. ‘మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడానికి త్వరలో మరో అవకాశం రావొచ్చు. అందుకే ఇప్పటినుంచే పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉండండి. ఆల్‌ ద బెస్ట్‌’ అని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌పై మరోసారి దాడికి దిగితే ఆపరేషన్‌ సిందూర్‌ వెంటనే ప్రారంభమవుతుందని పాకిస్తాన్‌ను ఆయన హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో పాక్‌ దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 ఉంటుందని జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ ఏడాది మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. పాక్‌ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఎయిర్‌బేస్‌లపై నాలుగు రోజులపాటు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.   
 

ఇదీ చదవండి:
ఆపరేషన్‌ సిందూర్‌పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్‌ చీఫ్‌

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)