Breaking News

ఘనంగా ‘స్పేస్‌ డే’ వేడుకలు

Published on Thu, 08/22/2024 - 19:42

సాక్షి,హైదరాబాద్‌ : చంద్రయాన్‌-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ కీర్తి పెరిగింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్ర పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి  రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ విభాగం ఉద్యోగులు రెండ్రోజుల పాటు నేషనల్‌ స్పేస్‌డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.  

ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్ధులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాలవైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించారు. నేషనల్‌ స్పేస్‌ డే వేడుకల్ని పుస్కరిచుకొని తొమ్మిది పాఠశాలల విద్యార్ధులను ఆహ్వానించారు. వారికి మోడల్ మేకింగ్ పోటీ, క్విజ్, డ్రాయింగ్/పెయింటింగ్ పోటీలతో సహా అనేక రకాల పోటీలను నిర్వహించారు.  

దీంతో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రదర్శించిన వాహనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ వాహనంలో స్పేస్‌కి సంబంధించిన కీలక అంశాలను ఇందులో ప్రదర్శించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఈ మొబైల్ ఎగ్జిబిషన్‌ను కోఆర్డినేట్ చేయగా.. విద్యార్థులు, ఎన్‌ఆర్‌సీఐ ఉద్యోగులు,యువ సైంటిస్ట్‌లు వీక్షించారు.  


ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌.విజయ్ విజేతలకు బహుమతులు అందించారు. నేషనల్‌ స్పేస్‌ డే వేడుకల్లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు ప్రశంసా పత్రంగా ‘స్పేస్ ఎన్‌సైక్లోపీడియా’ పుస్తకాలను బహుమతిగా అందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పాపియా బిశ్వాస్‌,డాక్టర్‌ సంజయ్ ధాగే, మనీష్ తక్,డాక్టర్‌ నవీన్, ఎం.చవాన్, ఎన్.అపర్ణరావు,ఎం.ఇళయరాజా, ఎన్.అరుణ,ఎం.ఆర్.రెంజు,రీ డి.రమేష్, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)