Breaking News

దూసుకుపోతున్న ‘చదువురాని చాయ్‌వాలా’

Published on Mon, 03/11/2024 - 08:54

దేశంలో టీ దుకాణాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఎక్కడ కొత్తగా టీ దుకాణం ఏర్పాటైనా అది విజయవంతం అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. తాజాగా బీహార్‌లో వినూత్న టీ దుకాణం  ఏర్పాటయ్యింది. దాని పేరు వినగానే  ఎవరికైనా వింతగా అనిపిస్తుంది. 

మాధేపురాలోని సింగేశ్వర్‌కు చెందిన రోహిత్ ‘అన్‌పఢ్‌ చాయ్‌వాలా’ (చదువురాని చాయ్‌వాలా) పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ  ఐదు రకాల టీలు లభిస్తాయి. అయితే ఇక్కడ టీ బాగోలేదని ఎవరైనా వినియోగదారుడు అంటే రోహిత్‌ వారికి డబ్బు  వాపసు చేస్తాడు. విద్యార్థులకు టీపై ప్రత్యేక డిస్కౌంట్‌ కూడా ఇస్తుంటాడు. రోహిత్‌ తన దుకాణంలో టీని రూ. 10కే అందిస్తున్నాడు.

మొదట్లో తన దుకాణం పేరు బాగోలేదని చాలామంది అన్నారని, అయితే ఆ పేరు అలాగే ఉంచాలని అనుకున్నానని రోహత్‌ తెలిపాడు. తాను ఎటువంటి డిగ్రీ చదవలేదని, పెద్దగా ఏమీ చదువుకోలేదని అందుకే అన్‌పఢ్‌ చాయ్‌వాలా అని దుకాణానికి పేరు పెట్టానని రోహిత్‌ వివరించాడు. ‍ఇప్పుడు తన టీ దుకాణం పేరు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోందని, తాను ప్రతిరోజూ 400 నుండి 500 కప్పుల టీ విక్రయిస్తున్నానని రోహిత్‌ తెలిపాడు. 

విద్యార్థులకు 10శాతం తగ్గింపు ధరకే టీ ఇస్తున్నానని, దీనివలన చదువుకుంటున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని రోహిత్‌ తెలిపాడు. యూట్యూబ్‌లో పలు టీ దుకాణాల వీడియోలను చూశాక, తాను ‘అన్‌పఢ్‌ చాయ్‌వాలా’ పేరుతో సొంత స్టార్టప్‌ను ప్రారంభించానని అన్నాడు. తాను వినియోగారులకు మసాలా టీ, ప్లెయిన్ టీ, స్పెషల్ టీ, అల్లం టీ, కాఫీ టీ అందిస్తున్నానని తెలిపాడు. 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)