Breaking News

మహారాష్ట్రలో మరో చీలిక?

Published on Mon, 12/08/2025 - 19:54

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో చీలిక రానుందా?.. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే వర్గం త్వరలో చీలిపోయే అవకాశం ఉందని తెలిపారు. మహాయుతి మిత్రపక్షంలో  22 మంది ఎమ్మెల్యేలు జంపు జిలానీకి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

21వ శతాబ్ధపు భారత రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలు గుర్తుండిపోతాయి. ఎత్తులకు పైఎత్తులు, పార్టీల జంప్, ప్రభుత్వాలని కూలగొట్టడం లాంటివి అక్కడ ప్రస్తుతం కామన్‌గా మారాయి. 2022లో  శివసేన పార్టీని చీల్చి 40 మంది ఏమ్మెల్యేలతో ఆపార్టీ మాజీ నేత ఏకనాథ్ షిండే ప్రభుత్వాన్ని కూల్చారు. బీజేపీతో చేతులు కలిపి సీఎంగా మారారు. దాని అనంతరం అజిత్ పవార్ సైతం ఎన్సీపీలో చీలిక తెచ్చి 41 మంది ఎమ్మెల్యేలతో బయిటకి వచ్చారు. తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కలిశారు. దీంతో మరాఠా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరికి అర్థం కాకుండా మారింది.

ఈ నేపథ్యంలో శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. మహయుతి మిత్రపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చాలా దగ్గరగా ఉన్నారని.. త్వరలో వాళ్లు ఆయనతో కలిసే  అవకాశాలున్నాయని తెలిపారు. అలా పరోక్షంగా శిండే వర్గాన్ని హెచ్చరించారు. అంతే కాకుండా వర్లీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22 మంది వైస్ కెప్టెన్ అంటారని పరోక్షంగా మంత్రి ఉదయ్ సమంత్ ను ఉద్దేశించి మాట్లాడారు.

అయితే గతంలోనూ అజిత్ పవార్, శిందేలతో పాటు ఉదయ్ సమంత్ కూడా సీఎం రేసులో ఉండడం తెలిసిందే. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)