Breaking News

ఒడిశాలో మరో రష్యా పౌరుడు మృతి.. రెండు వారాల్లో మూడో ఘటన

Published on Tue, 01/03/2023 - 12:03

భువనేశ్వర్‌: ఒడిశాలో రష్యా పౌరుల మిస్టరీ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే హోటల్‌లో ఇద్దరు రష్యన్లు మృతి చెందిన మిస్టరీ వీడకముందే రష్యాకు చెందిన మరో పౌరుడు మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో ముగ్గురు రష్యన్లు మరణించటంతో ఇంతకి ఒడిశాలో ఏం జరుగుతోందనే ఆందోళన నెలకొంది. జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాలోని పారాదిప్‌ పోర్టులో ఓ షిప్‌లో మంగళవారం రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది. 

‘ఎంబీ అల్ద్నాహ్‌’ షిప్‌లో చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల మిలియాకోవ్‌ సెర్గేగా పోలీసులు గుర్తించారు. ఆ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ పోర్టు నుంచి పారాదీప్‌ పోర్టు మీదుగా ముంబైకి వస్తోంది. నౌకలోని తన ఛాంబర్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే, అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

ఒకే హోటల్‌లో ఇద్దరు.. 
గతంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలో ఓ హోటల్‌లో ఇద్దరు టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. అందులో ఒకరు రష్యా చట్ట సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. వారు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడటం చర్చకు దారి తీస్తోంది. రష్యా చట్ట సభ్యుడు పావెల్‌ ఆంటోవ్‌(65) డిసెంబర్‌ 24న హోటల్‌ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అంతకు ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్‌ బిదెనోవ్‌(61)హోటల్‌ గదిలో మృతి చెందాడు. ఈ రెండు కేసులపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ‘పుతిన్‌’ను వ్యతిరేకిస్తే అంతేనా? ఒడిశాలో మరో రష్యన్‌ మిస్సింగ్‌!

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)