Breaking News

ఢిల్లీలో మరో పేలుడు శబ్దం

Published on Thu, 11/13/2025 - 10:15

ఢిల్లీ: ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది. మ‌హిపాల్‌పూర్ (Mahipalpur) ప్రాంతంలోని రాడిసన్‌ హోటల్‌ సమీపంలో గురువారం ఉదయం భారీ శబ్దంతో పేలుడు జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉదయం 9.18 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. డీటీసీ బస్సు టైర్ పేలిన భారీ శబ్దంగా పోలీసులు పేర్కొన్నారు.

అనుమానాస్పద వస్తువులేవి కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. సాధారణ టైరు పగిలిన సంఘటనగా పోలీసులు తేల్చారు. ఉదయం 9.18 నిమిషాల సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ శబ్దం విన్న ఓమహిళ మొదట PCR కాల్ చేయగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఢిల్లీ పోలీస్ బృందాలు, బాంబు నిర్వీర్య దళం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అయితే, హోటల్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఢౌలా కువాన్ వైపు వెళ్తున్న డీటీసీ బస్సు వెనుక టైరు పేలడంతో ఆ శబ్దం వచ్చిందని తెలిపారు. నవంబర్ 10 సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు నేపథ్యంలో దేశ‌ రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.

Videos

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)