Breaking News

మరో చీతా మృత్యువాత.. నాలుగు నెలల్లో ఏడో మరణం

Published on Wed, 07/12/2023 - 08:36

భోపాల్‌: ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యుదేవత దిశగా అడుగులేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయవనంలో ఉన్న మగ చీతా తేజస్‌ మంగళవారం కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. దీంతో గత నాలుగు నెలల్లో మరణించిన చీతాల సంఖ్య ఏడుకు పెరిగింది. నాలుగేళ్ల వయసు ఉన్న తేజస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. మరణించిన ఏడు చీతాల్లో నమీబియా చీతా జ్వాలకు జన్మించిన మూడు చీతా కూనలూ ఉన్నాయి.

దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చీతాల పునర్‌ఆగమన కార్యక్రమం నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ‘వాటిల్లో అవి ఆధిపత్యం కోసం చేసుకున్న ఘర్షణల్లో గాయపడటం వల్లే తేజస్‌ మరణించి ఉంటుంది. మరణించేనాటికి ఇది ఇంకా ఎన్‌క్లోజర్‌లోనే ఉంది’ అని వైల్డ్‌లైఫ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జేఎస్‌ చౌహాన్‌ అంచనావేశారు. రెండు మగ చీతాలను అడవిలోకి వదిలేసిన మరుసటి రోజే ఇలా ఒకటి మరణించడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు.
చదవండి: ప్రాజెక్ట్‌ చీతా.. కొత్త పరేషాన్‌  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)