Breaking News

వారికే ఓటేయండి.. అన్నా హజారే పిలుపు

Published on Sun, 01/26/2025 - 08:02

ముంబై: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. మచ్చ లేని వ్యక్తిత్వం కలిగిన వారు, దేశం కోసం త్యాగం చేయగలిగే వారికే ఓటేయాలని ఢిల్లీ పౌరులకు అన్నా హజారే విజ్ఞప్తి చేశారు. అలాగే, అప్రయోజకులకు ఓటు వేయవద్దని, అలాచేస్తే దేశం నాశనమవుతుందని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అన్నా హజారే శనివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నా హజారే..‘త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛమైన వ్యక్తిత్వం, ఆలోచనలు కలిగిన వారు, సన్మార్గంలో నడిచేవారు, అవమానాలను దిగమింగి అవసరమైతే దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ‘నేను తాగుతాను కాబట్టి, ఇది ఇతరులు కూడా తాగేందుకు అనుకూలంగా ఉంటుంది’ అనే వైఖరి ఎన్నికల ప్రక్రియలో పనికి రాదన్నారు. ఢిల్లీ కేంద్రంగా గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఆయనతో పోరాటంలో పాలుపంచుకున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ అనంతర కాలంలో ఆప్‌ను స్థాపించి, ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడం హజారేకు ఇష్టంలేదు. ఆ తర్వాత పరిణామాల్లో ఇద్దరూ దూరమయ్యారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)