Breaking News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ నేల కొరిగిన ఆంధ్రా జవాను

Published on Tue, 01/21/2025 - 05:29

శ్రీనగర్‌/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్‌లోని సొపోర్‌ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్‌(32) అనే జవాను బుల్లెట్‌ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. 

ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్‌ వీరమరణంపై శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్‌ కార్ప్స్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్‌ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్‌ కార్ప్స్‌ సెల్యూట్‌ చేస్తోంది చినార్‌ వారియర్స్‌ కార్తీక్‌ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది.

 ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్‌’లో తెలిపింది. కాగా, కార్తీక్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్‌ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)