Breaking News

కన్నడనాట పాల గోల.. ఇప్పుడు నందినీపై పడ్డారని బీజేపీపై విమర్శలు

Published on Tue, 04/11/2023 - 03:38

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాలపై వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బెంగళూరులో ఆన్‌లైన్‌ ద్వారా అమూల్‌ పాలు, పెరుగు విక్రయించనున్నట్టు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమూల్‌కు వ్యతిరేకంగా పలు కన్నడ సంస్థలు సోమవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి.

గో బ్యాక్‌ అమూల్, సేవ్‌ నందిని అంటూ హాష్‌ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలోనూ నిరసనలు జోరందుకుంటున్నాయి. అమూల్‌ను రాష్ట్రంలోకి తీసుకొచ్చి స్థానిక నందినీ డెయిరీని దెబ్బ తీసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్‌) విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘గుజరాత్‌కు చెందిన బరోడా బ్యాంక్‌ మా విజయ బ్యాంక్‌ను కబళించింది. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నింటినీ గుజరాతీ అయిన అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు నందినీ డెయిరీపై పడ్డారు’’ అంటూ కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య దుయ్యబట్టారు.

జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి కూడా అమూల్‌పై విమర్శలతో ట్వీట్లు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అమూల్‌ కర్ణాటకలోకి ప్రవేశించడం లేదని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ చెప్పారు. నందినీ డెయిరీని అమూల్‌లో విలీనం చేస్తారన్నది కూడా కాంగ్రెస్‌ కుట్రపూరిత ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ హయాంలోనే నందినీ డెయిరీ భారీగా విస్తరించిందని చెప్పుకొచ్చారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)