మనసున్న పోలీసాయన.. వీడియో వైరల్‌

Published on Thu, 06/29/2023 - 09:50

సోషల్‌ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక కుక్క తల కారు బంపర్‌లో ఇరుక్కుపోవడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. దానిని రెస్క్యూ చేసేందుకు అమృత్‌సర్‌ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. అతను ఆ కుక్క తలను కారు బంపర్‌ నుంచి బయటకు తీశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 8 వేలకుపైగా నెటిజన్లు చూశారు. చాలామంది ఈ వీడియోను రీట్వీట్‌ చేస్తూ, పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను అమృత్‌సర్‌ పోలీస్‌ కమిషనర్‌ తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘ఇది హదయానికి హత్తుకునే పని. ఒక కుక్క తల.. కారు బంపర్‌లో ఇరుక్కుపోయింది. అమృత్‌సర్‌ పోలీసు అధికారి ఒకరు దానిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అతను ఎంతో నేర్పుగా, సురక్షితంగా దాని తలను బంపర్‌ నుంచి బయటకు తీశారు. ఈ నేపధ్యంలో ఆ కుక్కకు ఎటువంటి గాయం కాలేదని’ రాశారు. 

పోలీసు అధికారి మెచ్చుకుంటున్న జనం..
ఈ వీడియోను చూసి కామెంట్‌ చేస్తున్న నెటిజన్లు  కుక్కను కాపాడేందుకు ఆ అధికారి వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్‌ ‘ఈ పని వారి యూనిఫారంనకు మరింత గౌరవాన్నిస్తుంది. భగవంతుడు ఆ అధికారిని.. ఇటువంటి గొప్ప పనిచేసినందుకు ఆశీర్వదిస్తాడు’ అని రాశారు. కొందరు యూజర్స్‌ జంతుప్రేమ గురించి ప్రస్తావించారు. మరో యూజర్‌ ‘అ‍న్ని ప్రాణుల విషయంలోనూ సానుభూతితో మెలగాలని అన్ని ధర్మాలు చెబుతున్నాయి. అదే మానవత్వమని పేర్కొంటున్నాయి’ అని రాశారు. 

ఇది కూడా చూడండి: పర్ఫెక్ట్‌ టైమింగ్‌:కెమెరాకు చిక్కిన మూడు తలల  చీతా!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)