Breaking News

Amritpal Singh: భార్య అరెస్టు అవుతుందనే భయంతో లొంగిపోయాడా?

Published on Sun, 04/23/2023 - 21:16

ఖలీస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్‌ సింగ్‌ నెలరోజులుగా పరారీలో ఉండి ఈరోజు(ఆదివారం) అనుహ్యంగా అరెస్టవ్వడం పలు అనుమానాలను రేకెత్తించింది. అతను పంజాబ్‌ నుంచి నేపాల్‌ అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్న వేళ..అనుహ్యంగా పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రత్యక్షమవ్వడం అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. అదీకూడా అతడి భార్య కిరణదీప్‌ కౌర్‌ అతన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన రెండు రోజుల్లోనే అమృత్‌పాల్‌ అరెస్టు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అతను మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి అతనిపై అణిచివేత ప్రారంభమైంది. ఆ క్రమంలోనే అతడి భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌పై పంజాబ్‌ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో నివశిస్తున్నారు. అదీగాక ఆమె వీసా గడువు ఈ జూలైలో ముగుస్తోంది. సరిగ్గా ఆమె అమృత్‌పాల్‌ కోసం వేట కొనసాగిస్తున్న తరుణంలోనే లండన్‌ వెళ్లేందుకు యత్నించింది. ఐతే ఆమె విమానం ఎక్కి వెళ్లిపోతుందనంగా..చివరి నిమిషంలో ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకుని లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసి ఆమెను దేశం విడిచి వెళ్లొద్దని చెప్పారు. దీంతో కిరణ్‌ కౌర్‌ అరెస్టు ఖాయమని వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి ఆమెను దేశం నుంచి సురక్షితంగా దాటించేయాలనకున్నాడు. అది బెడిసికొంటింది.

మరోవైపు తాను పారిపోయేందుకు సాయం చేసినందుకు గానూ తన భార్య అరెస్టు ఖాయమన్న భయం కూడా అమృత్‌పాల్‌ని వెంటాడింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉండవచ్చనని అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్‌ పౌరసత్వ కలిగి ఉన్న అతడి భార్య ద్వారా కిరణ్‌ దీప్‌ కౌర్‌ యూకేకి నిధులు మళ్లించినట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఎక్కడ బయటపడుతుందన్న భయం కూడా అమృత్‌పాల్‌లో మొదలైంది.

ఈ కారణాల రీత్యా  అతను పంజాబ్‌లో తన సొంత మోగా జిల్లాలో ప్రత్యక్షమై లొంగిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కిరణ్‌దీప్‌ కౌర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది.ఆమె పెళ్లి అమృత్‌పాల్‌ స్వస్థలమైన జల్లుపూర్‌ ఖేరా గ్రామంలో జరిగింది. పోలీసుల అతడి ఆచూకి కోసం సాగిస్తున్న వేటలో అమృత్‌పాల్‌ తల్లి తోపాటు ఆమెను కూడా విచారించారు. 

(చదవండి: గర్వంగా ఉంది! అమృతపాల్‌ తల్లిదం‍డ్రుల స్పందన..)

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు