Breaking News

మరో ‘అమృత్‌ భారత్‌’కు పచ్చజెండా.. ఎక్కడి నుంచి? సమయాలేమిటి?

Published on Fri, 08/08/2025 - 11:49

న్యూఢిల్లీ: దేశంలో నేటి(శుక్రవారం) నుంచి మరో అమృత్‌ భారత్‌ రైలు పరుగులు తీయనుంది. బీహార్‌లోని సీతామర్హిని ఢిల్లీకి అనుసంధానించే ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచనుంది. అలాగే మధ్యతరగతి వర్గానికి ఆధునిక రైల్వే సేవల అనుభవాన్ని అందించనుంది.

సీతామర్హి-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సీతామర్హిలోని పునౌరా ధామ్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని తూర్పు మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 20 గంటల 45 నిమిషాల్లో దాదాపు 1,100 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగుల తీయగలదు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంది.

ఇది శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి, ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతామర్హి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 10.15 గంటలకు సీతామర్హి నుండి బయలుదేరి, సోమవారం రాత్రి 10.40 గంటలకు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 13 స్టాప్‌లున్నాయి. అవి ఘజియాబాద్, తుండ్ల, కాన్పూర్, లక్నో, గోండా, బస్తీ, గోరఖ్‌పూర్, కప్తాన్‌గంజ్, సిస్వా బజార్, బాగహా, సిక్తా, నర్కటియాగంజ్, రక్సౌల్ బైర్గానియా.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)