మూడెకరాలు, రూ. 35 కోట్లు : అయోధ్యలో ప్లాట్‌ కొన్న బిగ్‌బీ

Published on Fri, 03/06/2026 - 19:16

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్  విలువైన  ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ అయోధ్యలో 2.67 ఎకరాల భూమిని రూ. 35 కోట్లకు దక్కించుకున్నారు. అయోధ్యలో  అత్యంత  ప్రతిష్టాత్మకంగా రామ జన్మ భూమి  ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ ప్లాట్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని HoABL హౌస్ ఆఫ్ అభినందన్‌లో ఉంది. ఇక్కడే బచ్చన్ మరో రెండు ప్లాట్‌లను కలిగి  ఉండటం విశేషం.  HoABL  ప్రకటన ప్రకారం, ఈ అమ్మకాన్ని బచ్చన్ కుటుంబ యాజమాన్యంలోని సంస్థ AB Corp ప్రతినిధి నిర్వహించారు. HoABL తో బచ్చన్ చేసిన నాల్గవ కొనుగోలు ఇది, మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్ర రిసార్ట్‌లో  సోల్ దే అలీబాగ్ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌కు ఒక స్థలం ఉంది. భూమిపై పెట్టుబడుల తరతరాల విశ్వాసాన్ని బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందనీ, అయోధ్యపై విశ్వాసం అనేది తరతరాలుగా పంచుకున్న వారసత్వం  అన్నారు. HoABLలో, భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తామని HoABL చైర్మన్ అభినందన్ లోధా వ్యాఖ్యానించారు. 

ఇదీ  చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

కాగా ఆయోల్య ఆలయ నిర్మాణం, అలాగే విశాలమైన రోడ్లు, మెరుగైన రైల్వే స్టేషన్లు మరియు కనెక్షన్లు మరియు నగరానికి ప్రత్యేక విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత అయోధ్యలో భూమి ధరలు గణనీయంగా పెరిగాయి. HoABL, తదితర స్థానిక డెవలపర్లు, ప్రాజెక్టులతో పాటు రానున్న రోజుల్లో టూరిజం అభివృద్ధిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే పర్యాటకుల  రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు కల్పించడానికి హోటళ్ళు,రిసార్ట్‌లను కూడా నిర్మిస్తున్నారు. HoABL ప్రస్తుత ప్రాజెక్ట్, సరయులో, బ్రూక్‌ఫీల్డ్ యాజమాన్యంలోని హోటల్ చైన్ ది లీలా ప్యాలెస్‌లు, హోటల్స్ , రిసార్ట్స్ నిర్వహించే హోటల్ కూడా ఉంది.

ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్‌ తప్పదా? వైరల్‌ వీడియో
(రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌)


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)