Breaking News

సైబర్‌ నేరాల కట్టడికి ఏఐని వాడండి

Published on Wed, 09/11/2024 - 05:58

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికను వినియోగించుకుంటూ సైబర్‌ నేరాల కట్టడికి కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దర్యాప్తు సంస్థలను కోరారు. ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై వేధింపులకు పాల్పడటం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, మాయమాటలతో జనం కష్టార్జితాన్ని దోచుకునే నేరగాళ్లను ఏఐ ద్వారా గుర్తించొచ్చని మంత్రి తెలిపారు. ప్రపంచ డిజిటల్‌ లావాదేవీల్లో దాదాపు సగం, 46 శాతం వరకు భారత్‌ వాటా ఉందని, ఇలాంటి సమయంలో నేరాలను నివారించడం అత్యంత కీలకమని అన్నారు.

అయితే, దర్యాప్తు విభాగాలకు ఇది పెద్ద సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. మంగళవారం ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) మొట్టమొదటి వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అమిత్‌ షా కీలకోపన్యాసం చేశారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 2018లో ఐ4సీ ఏర్పాటైంది. సైబర్‌ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో సమన్వయ కేంద్రంగా ఐ4సీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా సైబర్‌ ఫ్రాడ్‌ మిటిగేషన్‌ సెంటర్‌(సీఎఫ్‌ఎంసీ), సమన్వయ వేదిక, సైబర్‌ కమాండోస్‌ ప్రోగ్రాం, సస్పెక్ట్‌ రిజిస్ట్రీ అనే నాలుగు విభాగాలను ఐ4సీలో అమిత్‌ షా ప్రారంభించారు.సైబర్‌ నేరాలపై సమర్థవంత పోరాటం కోసం పాతకాలపు ‘అవసరమైన విషయం మాత్రమే చెప్పడం’అనే పద్ధతిని విడనాడి, ‘బాధ్యతలను పంచుకోవడం’అనే విధానాన్ని అనుసరించాలని సూచించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)