Breaking News

మన్మోహన్ సింగ్ ఓ పిరికిపంద: అమిత్ షా ఫైర్‌

Published on Mon, 06/12/2023 - 08:46

విశాఖపట్నం: బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న నేపధ్యంలో విశాఖపట్నం వేదికగా ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతకుముందు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్గత భద్రత విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంతర్గత భద్రత వ్యవహారం పటిష్టంగా తయారైందని అన్నారు.   

ప్రజలు ధైర్యంగా ఉన్నారు.. 
బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అమిత్ షా సభనుద్దేశించి మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతర్గత భద్రత విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించేది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని అన్నారు.   

దేశంలో తీవ్రవాదాన్ని పెంచేశారు.. 
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆలియా, మాలియా, జమాలియా అనే పద్ధతిలో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు వారిపై చర్య తీసుకునే ధైర్యం లేదు. శత్రువులు మనపై దాడి చేసినా చేతులు ముడుచుకుని కూర్చునేవారు. నోరు విప్పేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రధాని అలాంటి సవాళ్ళన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే దేశ అంతర్గత భద్రత పెంచి ప్రజలకు భరోసా కల్పించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత సైన్యం ఎంతో తెగువతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఉరి, పుల్వామా సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ లు నిర్వహించి శత్రువులకు ఎదురెళ్లి మరీ భారత దేశ సత్తా ఏంటో చాటిందన్నారు. ఇప్పుడు తీవ్రవాదులు నరేంద్ర మోదీ పేరు వింటేనే భయపడుతున్నారని అన్నారు.      

ఇది కూడా చదవండి: పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)