Breaking News

బంగ్లాలో భారతీయులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం

Published on Fri, 08/09/2024 - 18:34

ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రత కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్‌ షా వెల్లడించారు.

కాగా, బంగ్లాదేశ్‌ రిజర్వేషన్ల అంశంపై నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయడం, దేశాన్ని వీడటంతో ముహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరోవైపు.. అక్కడ పరిపాలన వ్యవస్థ లేకపోవడంతో కొందరు మూకలు రెచ్చిపోతున్నారు. భారతీయులు, హిందువులు, పలువురు మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దుపై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులు, హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపడుతుందన్నారు. బీఎస్‌ఎఫ్‌ తూర్పు కమాండ్‌ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు చెప్పారు. ఇక, ఈ కమిటీలో దక్షిణ బెంగాల్‌, త్రిపుర విభాగాల బీఎస్‌ఎఫ్‌ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)