Breaking News

ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్‌ షా

Published on Tue, 10/22/2024 - 05:12

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు.

 ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్‌ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్‌ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)