Breaking News

ఢిల్లీ పేలుళ్లు.. అమిత్‌ షా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష

Published on Tue, 11/11/2025 - 10:20

ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవిందు మోహన్, ఐబి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్‌లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.జమ్మూ కశ్మీర్ డీజీపీ వర్చువల్‌గా హాజరయ్యారు. పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కేంద్రం హై అలర్ట్  జారీ చేసింది. 

పలు దర్యాప్తు సంస్థలు.. బాంబు పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. పేలుడు ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందాలు క్లూస్ సేకరించాయి. ఎర్ర కోట ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్, చాందిని చౌక్, గురు ద్వారాలన్నీ పోలీసులు మూసివేశారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అరెస్టుతో భారీ ఉగ్రకుట్ర వెలుగు చూసింది.

ఫరీదాబాద్‌లో 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోని ఎర్రకోట వద్ద ఉగ్ర దాడి జరిగింది. ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్న సమయంలోనే ఎర్రకోట వద్ద  డాక్టర్ ఉమర్ మహమ్మద్‌ బాంబు పేలుడుకు పాల్పడ్డాడు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు