Breaking News

అతని వైపుకి కాంగ్రెస్‌ టర్న్‌ తీసుకోదు! ఎందుకంటే..

Published on Sat, 04/15/2023 - 18:47

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా భరత్‌పూర్‌లో బూత్‌ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్తాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ వైపుకి కాంగ్రెస్‌ టర్న్‌ తీసుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ వైపే కాంగ్రెస్‌ మొగ్గు చూపుతుందని. ఎందుకంటే కాంగ్రెస్‌ ఖజనాను నింపడంలో గెహ్లాట్‌ సహకారమే ఎక్కువ కాబట్టి అంటూ సెటైర్లు వేశారు.

ఆ విషయంలో సచిన్‌ పైలట్‌ సహకారం తక్కువ అని దీంతో అతని వైపు మెజార్టీ సభ్యులు ఉండరన్నారు. అంతేగాదు గెహ్లాట్‌ రాజస్తాన్‌ ప్రభుత్వాన్ని అవినీతికి అడ్డాగా మార్చి దోచుకున్నారన్నారు. ఆ అవినీతి సొమ్ము కాంగ్రెస్‌ పార్టీ ఖజానాకు పోయిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2008లో జైపూర్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

రాజస్తాన్‌లో త్రీడీ ప్రభుత్వం ఉందని, మూడు 'డీ'లు అర్థం ఏమిటంటే.. డాంగే(అల్లర్లు), దుర్వ్యవర్‌(అన్యాయంగా ప్రవర్తించడం), దళితులపై ధౌర్జన్యాలు అంటూ కొత్త అర్థాలను ఆపాదిస్తూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రజలు ఎన్నికలలో ఈ పభ్రుత్వాన్ని తరిమికొడతారని, అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, పార్టీ సిద్ధాంతాలు, ఆయనకు ఉన్న ప్రజాధరణ తదితరాల కారణంగానే ఎన్నికల బరీలోకి దిగుతోందన్నారు. ఆశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజస్తాన్‌ చరిత్రలోని అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దీంతో ప్రజలు విసిగిపోయారంటూ అమిత్‌ షా కాంగ్రెస్‌పై విరుచుకపడ్డారు. కాగా, సచిన్‌ పైలట్‌ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని పెలట్‌ని హెచ్చరించింది కూడా. 

(చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)