Breaking News

ఎండ వేడి నుంచి ఉపశమనం .. ఢిల్లీని ముద్దాడిన వర్షం

Published on Wed, 05/29/2024 - 20:15

న్యూఢిల్లీ:   దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్‌పూర్‌లో 52.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. భయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.

అయితే ఉదయం నుంచి భగభగ మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. రికార్డుస్థాయి ఉ‍ష్ణోగ్రతలు నమదైన అనంతరం తేలికపాటి వర్షాలుక ఉరిశాయి. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది.  దీంతో వేడి, ఉక్కపోతతో అల్లాడిన రాజధాని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. చల్లటి గాలలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.

ఢిల్లీ,  ఖార్ఖోడా, ఝజ్జర్, సోహానా, పల్వాల్, నుహ్, ఔరంగాబాద్, హోడల్ (హర్యానా) జట్టారి, ఖైర్ (హర్యానా)తోపాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాబోయే రెండు గంటలు అక్కడక్కడా చిరు జల్లులు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు ఢిల్లీని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే రూ.2 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి