Breaking News

20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్‌.. నాలుగేళ్లు నిజమైన జైలు?

Published on Sat, 01/27/2024 - 11:25

అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఒక యువకుడు  ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్‌ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు.

అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు.

ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ డిస్కార్డ్‌లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు.

గార్సియా తాను టార్గెట్‌ చేసుకున్న​ ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు.

గార్సియా.. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్‌కు ఫోన్‌ చేసి, లాస్ ఏంజెల్స్‌కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్‌కాయిన్‌ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు.

2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్‌ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్‌లో ఒక పోలీసు అధికారి  ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్‌కు చెందిన  గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు.  గార్సియాకు ఏప్రిల్‌లో శిక్ష ఖరారు కానుంది. 

అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు  గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్‌లోని సీటాక్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచి విచారిస్తున్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)